మెదడుకు మేత - 1
1. ఆవగింజంత బలహీనత గల తండ్రికి భూగోళంలో చెప్పుకోదగినంత భూపుత్రుడవుతాడు . ఆ మహా భూ పుత్రుడెవరు?
2. నీటిలో తెప్పలు తిరుగుతాయి . అవే చాలా మందికి ఆహారం . ఆ తెప్ప లేవి?
3. చీనా వాడు నీటిలో మునుగితే చూపరులకు చూద్దామన్న కనపడడు. వాడెవడు ?
4. గూళ్లలో ఉంటాము చిలకలం కాము . కాపలా వాళ్లుంటారు రాజూ మంత్రి కాము. కన్నోళ్లనందరిని ఫోటోలు తీస్తాము కెమెరాలము కాము . ఎందరొచ్చి పిలిచినా గూడు వదిలి రాము . ఎంత మంది తరిమినా తప్పించుకొని పోము . కాపలా వాళ్లతో కలిసి మెలసి పోతాము. కన్నోళ్ల నెప్పుడూ గుర్తుంచుకుంటాము
5.నీటిలో ఉంటాను పడవను కాను
6. రంగని నెంట తిరిగే లింగడు ఎంత కొట్టినా లొంగడు
7. చిన్న చిన్నిండ్లు చిత్రమైనిండ్లు
ఇంటింటికి లంకె లంకెకో కొంకి
ఆడ వాళ్లు కోరుకొనే అరుదైన ఇండ్లు
8. తూట్ల తూట్ల గుర్రం తుస్సు మనే గుర్రం
ఎక్కే గుర్రం ఎక్కతా ఉంటే
దిగే గుర్రం దిగతా ఉంటే
గుర్రానికి కావాలి కుదురయిన తోడు
తోడుంటె చాలు భలె మెచ్చుతారు
9. తల్లిని చంపిన దాన్ని తెచ్చి తరిగి వండుకుంటారు
10. నల్లని మంచం మీద వేసే పరుపుకు తీసే పరుపుకు విరామమే లేదు
____
Comments
Post a Comment